కల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ :  రేవంత్ రెడ్డి

కల్వకుంట్ల అయినా మరెవరైనా రండి.. చర్చకు మేము రెడీ :  రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 14 అసెంబ్లీ.. 2 లోక్ సభ స్థానాలలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా చర్చ పెడదాం.. కల్వకుంట్ల అయినా మరెవరైనా రమ్మనండి.. మేము రెడీ అంటూ సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మే 25వ తేదీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎంతో మంది గొప్ప పరిపాలనా దక్షకులను అందించిన జిల్లా పాలమూరు జిల్లా అని అన్నారు.2009లో ఆలంపూర్ లో వరదలకు అతలాకుతలం ఐతే.. బంజారాహిల్స్ లో తన ఇల్లు అమ్మి.. మీకు ఇళ్ళు కట్టిస్తామని అనాడు సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడని గుర్తు చేశారు రేవంత్.

కరీంనగర్ లో సీఎం కేసీఆర్ ను తరిమి కొడితే వలస వచ్చిన ఆయన్ను గెలిపించినం.. కానీ మన బతుకులను ఆగం చేసిండు అని రేవంత్ ధ్వజమెత్తారు.తాను జడ్చర్లలో ఇండిపెండెంట్ గా గెలిచి వచ్చిన చిన్న మొక్కను.. ఈనాడు అదే మొక్క పెద్దదై మహా వృక్షంగా పీసీసీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ప్రతీ ఎకరానికి నీళ్లు పారుతాయి.. మరి మన పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎవరు అడ్డుకున్నారని పూర్తి చేయలేదని రేవంత్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో వచ్చేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే..ఈ ప్రాంత సమస్యలను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తామే పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇల్లు కట్టుకునేతందుకు ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఇస్తామన్నారాయన.గ్యాస్ సిలిండర్ 500 వందలకే అందిస్తాన్నారు. రెండు లక్షలు రూపాయల రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్.