క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ లో చేర్చాల‌ని ఉత్త‌మ్ డిమాండ్

క‌రోనా చికిత్స‌ను ఆరోగ్య‌శ్రీ లో చేర్చాల‌ని ఉత్త‌మ్ డిమాండ్
  • ఈ నెల 18న కాంగ్రెస్ డిజిట‌ల్ ఉద్యమం
  • “గళం విప్పండి” పేరు తో ఆన్ లైన్ కార్యక్రమం

కోవిడ్ నియంత్రణలో తెలంగాణ‌ ప్రభుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని అన్నారు‌ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. రాష్ట్రం క‌రోనా టెస్టుల్లో లాస్ట్, పాజిటివ్ పర్సెంట్ లో ఫస్ట్ అని అన్నారు. కరోనా వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింద‌ని, ప్ర‌జ‌ల ఆరోగ్యం విష‌యంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని అన్నారు.

కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు ఉచిత వైద్యం చేయడంతో పాటు.. ప్రైవేట్ హాస్పిటల్ ఫీజులు నియంత్రించాలని ఈ నెల 18న కాంగ్రెస్ డిజిటల్ ఉద్యమం చేప‌ట్ట‌బోతుంద‌ని ఉత్త‌మ్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి 50లక్షల భీమా కల్పించాల‌నే డిమాండ్‌ల‌తో…  “గళం విప్పండి” పేరు తో ఆన్ లైన్ కార్యక్రమం నిర్వ‌హిస్త‌మని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతలంతా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల ద్వారా వాయిస్ వినిపిస్తామ‌ని ఉత్త‌మ్ అన్నారు.

PCC Chief Uttam Kumar Reddy demanded the Telangana government to include Corona treatment in Aarogyasri