విద్యార్థులు జీవితాలతో మోడీ, కేసీఆర్ లు ఆటలాడుతున్నారు

విద్యార్థులు జీవితాలతో మోడీ, కేసీఆర్ లు ఆటలాడుతున్నారు

గాంధీ భవన్: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని గాంధీభవన్‌లో NSUI చేపట్టిన ఆమరణ దీక్షకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లుగా ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరు తో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నార‌ని, కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పరీక్షలు ఏంటని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.

విద్యార్థులు జీవితాలతో దేశంలో మోడీ, రాష్ట్రం లో కేసీఆర్ ఆటలు ఆడుతున్నారని ఉత్త‌మ్ విమర్శించారు. జాతీయ స్థాయి లో నిర్వహించే NEET, JEE ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వెయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ని కూడా వాయిదా వెయ్యాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయ్యకార్ భవన్ వద్ద ఆందోళన చేపడతామ‌న్నారు ఉత్త‌మ్. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లతో పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు.