‘కాంగ్రెస్ నాయ‌కులు, కార్యకర్త‌లు ఈ టైమ్‌లో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి’

‘కాంగ్రెస్ నాయ‌కులు, కార్యకర్త‌లు ఈ టైమ్‌లో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి’

క‌రోనా నేప‌థ్యంలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ సూచ‌న‌

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు వైర‌స్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. కార్య‌క‌ర్త‌లంతా అప్రమత్తంగా ఉండాల‌ని,జాగ్రత్తలు పాటించాల‌ని తెలిపారు.

క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట నుంచి వైరస్ నివారణలో పూర్తిగా విఫల‌మ‌య్యార‌ని, నిర్లక్షంగా వ్యవహరించార‌ని అన్నారు. ఫలితంగా ప్రస్తుతం రోజుకు వందల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. “కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ విపత్కర పరిస్థితులలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని రకాల నిబంధ‌న‌ల‌ను పాటించాలి. కరోనా బారిన పడకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కులు మరియు ఫేస్ షిల్డ్ లు ధరించి ఉండడం, ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండడం లాంటివి పాటించాలి” అని ఉత్త‌మ్ అన్నారు

పార్టీ కార్యక్రమంలో కూడా అన్ని రకాల కోవిడ్ నిబందలను పాటించాలని ఉత్తమ్ సూచించారు. గాంధీ భవన్ తోపాటు అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో విధిగా మాస్క్ లు ధరించాలన్నారు. ప్రెస్ మీట్స్ సమయాలలో విలేకరులు కూడా మాస్కులు ధరించాలని చెప్పారు. మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు సమాజాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూడాలని కార్యకర్తలకు ఉత్త‌మ్ విజ్ఞప్తి చేశారు.