హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ త్వరలోనే బీజేపీలో విలీనం కానుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కవిత కూడా ఇదే విషయం పదే పదే చెపుతున్నదని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాకుంటే తెలంగాణలో ఇక ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని చెప్పారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా గెలుపు కాంగ్రెస్ దేనని స్పష్టం చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జనం స్పష్టమైన మెజార్టీ ఇచ్చినా ఇంకా కేటీఆర్, హరీశ్ ఏ మొఖం పెట్టుకొని కాంగ్రెస్ పై, రేవంత్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
