- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్
హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నుంచి ఎదురవుతున్న బాధల కన్నా సొంత కుటుంబ సభ్యులు పెట్టే బాధలే ఎక్కువయ్యాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇటు కేటీఆర్, అటు కవిత, మధ్యలో హరీశ్ నుంచి వచ్చే బాధలతోనే కేసీఆర్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనమని, ఇది రేవంత్ పాలనకు రెఫరెండం అని చెప్పారు. ఈ బైపోల్ ఫలితంతోనైనా కేటీఆర్ అహంకారపు మాటలను మానుకోవాలని సూచించారు. రేవంత్ సర్కార్ ఈ రెండేండ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.
