
గతంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. ఇప్పుడు రేస్ కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ ను స్తంభీంప చేసి గత ప్రభుత్వం అవివేక నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందుల్లో పడి.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
కార్ రేస్ వల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండదని.. మాజీ మంత్రి కేటీఆర్ ఈ రేస్ ల వల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పడం తెలివి తక్కువ తనమని అన్నారు. ఫార్ములా రేస్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతీస్తుందని నిరంజన్ చెప్పారు. ఎమ్మెల్యే కోటా ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందని తెలిపారు. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. సాధారణ ఎన్నిక కాదని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే జరగుతాయని నిరంజన్ చెప్పారు.