వనమహోత్సవం విజయవంతం చేయాలి..పీసీసీఎఫ్ ​సువర్ణ పిలుపు

వనమహోత్సవం విజయవంతం చేయాలి..పీసీసీఎఫ్ ​సువర్ణ పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల డీఎఫ్​వోలతో శనివారం హైదరాబాద్​ సిటీలోని అరణ్య భవన్ లో ఆమె సమావేశం నిర్వహించారు. వనమహోత్సవం, జంతువుల సంరక్షణ, వన్యప్రాణులకు తాగునీటి కొరత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని అధకారులను సువర్ణ కోరారు.

వన మహోత్సవంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కంపా, హరితనిధి నిధులను వినియోగించాలని పేర్కొన్నారు. అడవుల సంరక్షణ కోసం పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్​ (అడ్మిన్​) సునీత భగవత్, సీసీఎఫ్ లు రామలింగం తదితరులు పాల్గొన్నారు.