రాజకీయ అక్కసుతో తెలంగాణకు కేంద్రం అన్యాయం: ఎంపీ వంశీకృష్ణ

రాజకీయ అక్కసుతో  తెలంగాణకు కేంద్రం అన్యాయం: ఎంపీ వంశీకృష్ణ

రాజకీయ అక్కసుతోనే తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.   గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడిన ఆయన ..రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన సెమి కండక్టర్ ఇండస్ట్రీని ఏపీకి కేటాయించిందన్నారు.  ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ పేరు తొలగించి కుట్ర చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ  ప్రభుత్వం పేదల కోసం కాకుండా అదానీ, అంబానీల కోసం పని చేస్తుందని విమర్శించారు .

‘కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దపల్లి పార్లమెంట్ కు 4 వేల 500కోట్ల నిధులు తీసుకొచ్చా. రోడ్లు, రైల్వే లైన్లు, ఓవర్ బ్రిడ్జిల కోసం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఎన్టీపీసీలో 2400 పవర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడాం. విదేశాల నుంచి యూరియా రాకపోవడంతో, రామగుండం ఎరువుల కర్మాగారంలో పూర్తి స్థాయిలో యూరియా ఉత్పత్తి రాకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా రాష్టానికి రావాల్సిన యూరియా ను ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. 

మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్నారు వంశీకృష్ణ.  ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అమలు చేస్తున్నారని చెప్పారు.  రెండు సంవత్సరాలుగా రేవంత్ సర్కార్ ప్రజా పాలన అందిస్తుంది. పది సంవత్సరాలుగా బీఆర్ఏస్ ప్రభుత్వం నిరుపేదల అభ్యున్నతిని విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నూతన రేషన్ కార్డులను ఇస్తున్నాం. సింగరేణి రిటైడ్ కార్మికులకు 10 వేల రూపాయల పెన్షన్ కావాలని పార్లమెంట్ లో ప్రస్తావించా.. మరో సారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం..

►ALSO READ | పార్టీ ఆఫీసుల్లో కాదు.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుర్రి: బీఆర్ఎస్‎పై జగ్గారెడ్డి ఫైర్

విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్ర మంత్రిని కలిశా.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సర్వే కోసం 50 లక్షల రూపాయల ఫీజు చెల్లించి అధికారులతో సర్వే చేయించా. సింగరేణి మారుపేర్ల సమస్య పై ప్రస్తావించా. త్వరితగతిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరా. లెదర్ పార్క్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు ఎంపీ వంశీకృష్ణ.