సింగరేణిలో 5,058 మందికి పెన్షన్ల నిలిపివేత

సింగరేణిలో 5,058 మందికి పెన్షన్ల నిలిపివేత
  • సింగరేణిలో 5,058 మందికి పెన్షన్ల నిలిపివేత
  • లైవ్​ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఆపేసిన సీఎంపీఎఫ్ ఆఫీసర్లు
  • పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరుతోన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి రిటైర్డ్​కార్మికులు, మృతిచెందిన కార్మికుల కుటుంబసభ్యులు లైవ్​సర్టిఫికెట్​ఇవ్వకపోవడంతో  పింఛన్లను సీఎంపీఎఫ్​ఆఫీసర్లు నిలిపివేశారు. పించన్ పొందాలంటే బతికి ఉన్నట్టు ప్రతి ఏడాది లైవ్​సర్టిఫికెట్​అందించాలి. వివిధ కారణాలతో లైవ్​సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో  గోదావరి ఖని కమిషనర్ పరిధిలో 3,240,  కొత్తగూడెం కమిషనర్​పరిధిలో1,818 మందికి పింఛన్ ఆగిపోయింది.

సింగరేణివ్యాప్తంగా గోదావరిఖని ప్రాంతీయ కమిషనర్ ఆఫీసు నుంచి 64,276 మంది, కొత్తగూడెం రీజియన్ లో 18,111 మంది కలిపి మొత్తం 82,387 మంది ప్రతి నెలా పెన్షన్ తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. వీరికి ప్రతి నెల గోదావరిఖని రీజినల్ కమిషనర్ పరిధిలో రూ.59. 85 కోట్లు, కొత్తగూడెం రీజినల్ కమిషనర్ పరిధిలో రూ.20. 06 కోట్లు మొత్తం రూ.79. 91 కోట్లను చెల్లిస్తున్నారు.

వీరిలో కేవలం లైవ్​సర్టిఫికెట్​అందజేయని కారణంగా 5,058 మందికి పింఛన్ ఆపేశారు.  కారణాలేవైనా కానీ.. రిటైర్డ్​ఉద్యోగులు, మరణించిన కార్మికుల భార్యలకు రెగ్యులర్​గా పింఛన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ బుధవారం అధికారులను కోరింది.