
వరదలతో మహారాష్ట్ర విలవిల్లాడుతోంది. మహారాష్ట్ర రూరల్ ఏరియాల్లో వరదలు భయానక పరిస్థితులను సృష్టించాయి. ముఖ్యంగా చంద్రాపూర్ లో వరదలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండ్లకు ఇండ్లే మునిగిపోయాయి. చంద్రపూర్ లో ప్రజల పరిస్థితి చూస్తుంటే హృదయం ద్రవిస్తోంది. గ్రామం పూర్తిగా చిన్నపాటి సంద్రాన్ని తలపిస్తోంది. వందల సంఖ్యలో ఇండ్లు నీటమునిగాయి. కొందరు జనం ఫస్ట్ ఫ్లోర్ లో తలదాచుకుంటున్నారు. మరికొందరైతే నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పర్యటించారు. వారికి నిత్యావసర సరుకులు అందించారు.
#WATCH Flood situation continues to remain grim, lives of people severely affected, in Maharashtra's Chandrapur pic.twitter.com/t65Gcilmtq
— ANI (@ANI) July 19, 2022