గ్రామాలను ఖాళీ చేస్తున్న ముంపు ప్రాంతాల ప్రజలు

గ్రామాలను ఖాళీ చేస్తున్న ముంపు ప్రాంతాల ప్రజలు

జూరాల ప్రాజెక్ట్  నుంచి  నీటిని విడుదల  చేయడంతో  ముంపు ప్రాంతాల  ప్రజలను  ఖాళీ చేస్తున్నారు. జోగులాంబ  గద్వాల జిల్లా  ధరూర్ మండలంలోని  నాగర్ దొడ్డి,  నెట్టింపాడు గ్రామాలకు  జూరాల  బ్యాక్ వాటర్  చేరడంతో  గ్రామస్తులు  ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ దొడ్డి  గ్రామంలోని  30 కుటుంబాలు   సామాగ్రితో  ఊరు  విడిచి వెళ్లిపోయారు. అటూ వందల  ఎకరాల్లో  పంట మునిగిందని,  మోటార్లు  కొన్ని  కొట్టుకుపోయాయాని  రైతులు  ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  నెట్టెంపాడు  గ్రామం  దగ్గరగా  నీరు ప్రవహిస్తోంది.  దీంతో  ప్రజలు  భయం  భయంగా గడుపుతున్నారు . 2009లో  ఇలాంటి వరదలు  వస్తే….  గ్రామాన్ని ఖాళీ  చేశామని, మళ్లీ  ఇప్పుడు  అదే పరిస్థితి ఏర్పడిందంటున్నారు . తమకు  వేరే  చోట  ఇళ్లు, భూములు  కేటాయిస్తే  గ్రామాన్ని ఖాళీ చేస్తామని  చెబుతున్నారు.