సిమ్‌కార్డు తీసుకునేవారికి కొత్త నిబంధనలు

సిమ్‌కార్డు తీసుకునేవారికి కొత్త నిబంధనలు

మొబైల్ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి కొత్త సీమ్‌ కొనుగోలు వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. రూల్స్  ప్రకారం కొంత మందికి మొబైల్ కనెక్షన్ పొందడం ఈజీ ..అయితే మరికొంత మందికి చాలా కష్టం కానుంది. దీని ప్రకారం  18 ఏళ్లు నిండిన వారు మాత్రమే సిమ్ కార్డులు కొనుగోలు చేసేలా నిబంధనలు రూపొందించింది.

కొత్త నిబంధన ప్రకారం…కొత్త మొబైల్ కనెక్షన్ కోసం స్టోర్ లకు వెళ్లాల్సిన అవసరంలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే…సిమ్ కార్డు డైరెక్ట్ గా ఇంటికి చేరుతుంది. ఇప్పుడు టెలికం కంపెనీలు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న  వినియోగదారులకు కొత్త సిమ్ ను అమ్మడం ఇక వీలు ఉండదు. 18 ఏళ్లు పైబడిన కస్టమర్లకు మాత్రమే… అది కూడా ఆధార్ ప్రూఫ్ తో అమ్ముతారు. దీనికి సంబంధించి  టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పుడు కంపెనీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సిమ్ కార్డులు అమ్మే అవకాశం లేదు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆ షాపు  యాజమానిని దోషిగా టెలికామ్ కంపెనీ పరిగణిస్తుంది. అలాగే ప్రీ పెయిడ్‌ ను…పోస్ట్‌ పెయిడ్ గా మార్చుకోవడానికి కొత్త వన్ టైం పాస్ వర్డ్ ఆధారిత ప్రక్రియ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తల కోసం...

లాలూప్ర‌సాద్ యాద‌వ్ కి  బెయిల్ తిరస్కరణ