హైదరాబాద్, వెలుగు: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రతీ పౌరుడికి, రాజకీయ పార్టీకి కల్పించిన హక్కు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌కు గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.
తెలంగాణలో కేసీఆర్ అవలంబించిన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలనే ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రజలు, ప్రతిపక్షాలు నిరసనలు తెలిపేందుకు చారిత్రక వేదికగా ఉన్న జంతర్‌మంతర్ వంటి వేదికలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని తెలిపారు. ప్రజల గొంతును నొక్కాలని చూసిన కేసీఆర్‌కు పట్టిన గతే, భవిష్యత్తులో నరేంద్ర మోదీకి కూడా పడుతుందని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.
