టీఆర్ఎస్‌‌కు గుణపాఠం చెప్పాలి

టీఆర్ఎస్‌‌కు గుణపాఠం చెప్పాలి

మునుగోడులో జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు తమవైపు ఉన్నారని.. బై పోల్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందనే భావన నెలకొందని అన్నారు. 17వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చీటకోడూరులో రచ్చబండలో పాల్గొన్న అనంతరం ఆయన వీ6 వెలుగుతో ముచ్చటించారు. 

బీజేపీకి పోటీగా టీఆరఎస్ ఫ్లెక్సీలు కడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సర్కార్ పై వ్యతిరేకత ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. సొంత పార్టీలో నేతల్లోనే భయం నెలకొందని.. కారు గుర్తుపై పోటీ చేయాలంటే వారు హడలిపోతున్నారని అన్నారు. కొందరు నేతలు కేసుల మాఫీ.. కాంట్రాక్టుల కోసం టీఆర్ఎస్ లో చేరుతుంటే... కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు ఆదిరిస్తున్నారని చెప్పారు. జనగామ జిల్లాలోని స్కూళ్లలో.. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం సిగ్గు చేటని బండి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి హరీష్ రావు చెసిన వ్యాఖ్యలు చూస్తే ఆయనకు అబద్దాల శాఖ మంత్రి పదవి ఇవ్వవచ్చని సెటైర్ వేశారు.