
ఓయూ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీలో పీఈటీ పోస్టులను తగ్గించి చూపిస్తోందని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి రాజేశ్ ఆరోపించారు. గురువారం ఫెడరేషన్ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ న్యూస్సెమినార్హాల్లో వ్యాయామ నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాజేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1,600 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం కేవలం 182 పోస్టులకు నోటిఫికేషన్ఇవ్వడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి స్కూల్లో పీఈటీని నియమించాలని కోరారు.