కరీంనగర్​ యువ ఇంజినీర్ ​ప్రతిభ

కరీంనగర్​ యువ ఇంజినీర్ ​ప్రతిభ

కరీంనగర్​ యువ ఇంజినీర్ ​ప్రతిభ
35 వేల ఖర్చయ్యిందన్న గంగాధర్​

కరీంనగర్​ సిటీ, వెలుగు : కరీంనగర్​లోని  సాయినగర్​కు చెందిన  బీటెక్ ఎలక్ట్రానిక్స్​చదివిన యువ ఇంజినీర్​ గంగాధర్.. పెట్రోల్​, ఎలక్ట్రిక్ బైక్​ను రూపొందించాడు. రెండు రకాల ఎనర్జీలను వాడడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుందంటున్నాడు.  ఈ బైక్​ తయారు చేయడానికి సుమారు రూ.35 వేల ఖర్చయ్యిందని చెప్పాడు. పెట్రోల్ ఇంజిన్ వాహనాన్ని ఎలక్ట్రిక్ వెహికల్​గా మార్చడం వల్ల పెట్రోల్ వాహనం ఇంజిన్​కు ఎలాంటి సమస్య ఉండదన్నాడు. ప్రభుత్వం అధికారులు స్పందించి తనకు అవకాశం కల్పిస్తే మరిన్ని వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తానని చెప్పాడు.  2017లో బీటెక్​ పూర్తి చేసిన గంగాధర్​సొంతంగా ల్యాబ్​ పెట్టుకుని రీసెర్చ్​ చేస్తున్నాడు.  కొత్త కొత్త ఐడియాలతో పరికరాలను తయారు చేయడం, ఎవరైనా ఆలోచనలను షేర్​చేస్తే వారితో కలిసి పని చేయడం గంగాధర్​ స్పెషాలిటీ. ఇంతకుముందు ఇతడు మొక్కలకు నీరు కావాల్సినపుడు ‘నీరు పోయండి’ అని చెప్పే డివైజ్​తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. 

మరిన్ని వార్తల కోసం..

 

డీఎస్ఈ ముందు కేజీబీవీ టీచర్ల ఆందోళన

 

అక్కడ సోనియా, ఇక్కడ కేసీఆర్ తో పీకే భేటీ