మే నెలలోనే 16 సార్లు పెరిగిన పెట్రోల్ ధర

మే నెలలోనే 16 సార్లు పెరిగిన పెట్రోల్ ధర

కరోనా సంక్షోభంలోనూ పెట్రో ధరల పెంపు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 25 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 98 రూపాయల 20 పైసలకు చేరగా.. లీటర్ డీజిల్ ధర 93 రూపాయల 8 పైసలకు పెరిగింది. ఇక దేశంలోని చాలా నగరాల్లో ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సెంచరీ క్రాస్ చేసింది. ముంబైలో మే 29న లీటర్ పెట్రోల్ వంద రూపాయలు దాటింది. ముంబైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 72 పైసలుగా ఉండగా... లీటర్ డీజిల్ ధర 92 రూపాయల 69 పైసలకు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 49 పైసలు, డీజిల్ ధర 85 రూపాయల 38 పైసలుగా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్‌లోనూ వంద రూపాయలు దాటింది. ఒక్క మే నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలనూ ఆయిల్ కంపెనీలు 16 సార్లు పెంచాయి.