పెట్రోల్, డీజిల్పై వారంలో లీటర్ పై 4 రూపాయలు పెంచారు కదా.. ఇది అస్సలు సరిపోదంట.. లీటర్ పై మరో 17 రూపాయల వరకు పెంచాలంట.. అంతేనా.. బంగారంపై జీఎస్టీ.. GST భారీగా వేయాలని కోరుతుంది కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్.
అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం వల్ల దేశంలోని ఆయిల్ కంపెనీలు ప్రతినెలా 25 వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నాయని.. ఈ నష్టాలను భర్తీ చేయాలంటే 3 రూపాయలు.. 90 పైసల పెంపు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ చెప్పుకొచ్చింది.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారల్కు 100 డాలర్ల దగ్గర ఇప్పుడు స్థిరంగా ఉన్నా.. అది రాబోయే రోజుల్లో 120 డాలర్లకు చేరుకోవచ్చని.. అప్పుడు ఆర్థిక లోటు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడొచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.
►ALSO READ | గుళ్ళలోని బంగారాన్ని అమ్మేయబోతున్నారా..? కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన
ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్పై 4 రూపాయలు పెంచటం వల్ల ఇంధన వినియోగం ఏ మాత్రం తగ్గదని.. అలాంటి అవకాశం కనిపించటం లేదన్నారు. లీటర్ పెట్రోల్పై కనీసం 13 రూపాయల నుంచి గరిష్ఠంగా 17 రూపాయల వరకు పెంచాల్సిన అవసరం ఉందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది.
అంతేకాకుండా బంగారంపై GST భారీగా పెంచటం ద్వారా కొనుగోళ్లు తగ్గొచ్చని.. దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతం పెంచటం వల్ల కొనుగోళ్లు తాత్కాలికంగా మాత్రమే తగ్గుతాయని.. దీర్ఘకాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గాలంటే జీఎస్టీ పెంచటం ఒక్కటే మార్గమని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయ పడింది. ఇదే సమయంలో 2027 భారత్ వృద్ధి రేటు 6 శాతంగా ఉండొచ్చని.. సగటు ద్రవ్యోల్భణం 5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
