చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఆర్టీఐ ద్వారా రెండు జిల్లాల కేసుల వివరాలు సేకరించిన  ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

చీటింగ్ బంకులను సీజ్ చేసి, ఓనర్లను కోర్టుల్లో విచారించాలని డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అనేక పెట్రోల్ బంకుల్లో చిప్ లను పెట్టి జనాన్ని మోసం చేస్తున్నా లీగల్ మెట్రాలజీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. లీటర్ పెట్రోల్, డీజిల్ కు 950 మిల్లీలీటర్ల ఫ్యూయెల్ మాత్రమే నింపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. మోసం చేస్తున్న పెట్రోల్ బంకులను సీజ్ చేయటంతో పాటు కేసులు నమోదు చేసి కోర్టుల్లో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. పెట్రోల్ బంకులను చెక్ చేస్తూ రూ.10 వేలు, రూ.25 వేలు ఫైన్ వేసి వదిలేస్తున్నారని లేఖలో తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో లీగల్ మెట్రాలజీ చెకింగ్, కేసుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ ద్వారా సేకరించింది. ఆ వివరాలను పద్మనాభరెడ్డి మీడియాకు విడుదల చేశారు. మేడ్చల్ జిల్లాలో 2018–-19లో 5 కేసులు, 2019–-20లో ఒక్క కేసు, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులను లీగల్ మెట్రాలజీ అధికారులు నమోదు చేశారని, ఫైన్ వేసి వదిలేశారని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ