డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు PFRDA లో జాబ్స్ ట్రై చేయండి

డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు PFRDA లో జాబ్స్ ట్రై చేయండి

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్​డీఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 06.

పోస్టులు: 40 ఆఫీసర్ గ్రేడ్–ఏ(అసిస్టెంట్ మేనేజర్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.  
లాస్ట్ డేట్: ఆగస్టు 06.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.