బషీర్ బాగ్, వెలుగు: నకిలీ కేబుల్ వైర్లు అమ్ముతున్న ఓ షాప్ యజమాని అరెస్టయ్యాడు. సెంట్రల్‌జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్ బజార్ పీఎస్ పరిధి కోఠి జైన్ మార్కెట్లో శ్రీ బాలాజీ ఎంటర్ప్రైజెస్ పేరిట ముకుల్ దూరగ్ అనే వ్యక్తి కేబుల్ వైర్లను అమ్ముతున్నాడు. కొంత కాలంగా ఫినోలెక్స్ కేబుల్ వైర్ల పేరిట నకిలీకి అమ్ముతూ వినియోగదారును మోసం చేస్తున్నాడు.
సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, సుల్తాన్ బజార్ పోలీసులు ఆ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. షాప్‌లో ఉన్న లక్షన్నర విలువ చేసే ఫినోలెక్స్ కంపెనీ నకిలీ కేబుల్ వైర్లును సీజ్ చేశారు. నిందితుడిని విచారించగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తనకు ఈ వైర్లను సప్లై చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. నిందితుడిని తమ అదుపులోకి తీసుకొన్న సుల్తాన్ బజార్ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
