నటి రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్స్..నిందితుడు అరెస్ట్ 

నటి రేణు దేశాయ్పై అసభ్యకర కామెంట్స్..నిందితుడు అరెస్ట్ 

గచ్చిబౌలి, వెలుగు: సోషల్ మీడియాలో సినీ నటి రేణు దేశాయ్​పై అసభ్యకరమైన కామెంట్స్ పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన రంజాల చెన్నయ్య యూట్యూబ్​లో రేణు దేశాయ్​కు సంబంధించిన రీల్ చూసి, దానికి అసభ్యకరమైన సందేశాన్ని పంపించాడు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రేణు దేశాయ్ ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని బుధవారం గుంటూరులో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.