స్టోర్లలో చొరబడి ఐఫోన్లు ఎత్తుకెళ్లారు

స్టోర్లలో చొరబడి ఐఫోన్లు ఎత్తుకెళ్లారు
  • అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పలు షాపులను లూఠీ చేసిన యువకులు

న్యూఢిల్లీ: యాపిల్ ఫోన్లే టార్గెట్​గా పలు స్టోర్లను యువకులు లూటీ చేశారు. అందినన్ని ఐప్యాడ్​లు, ఐఫోన్​లను ఎత్తుకెళ్లారు. మంగళవారం రాత్రి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఈ చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి 20 మంది యువకులను అరెస్ట్ చేశారు. రెండు పిస్టల్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్యే విడుదలైన ఐఫోన్ న్యూ మోడల్ కోసం ప్రపంచవ్యాప్తంగా స్టోర్లలో కస్టమర్లు క్యూ కడుతున్నారు.

ఫిలడెల్ఫియాలో మాత్రం కొందరు టీనేజర్లు గుంపులుగా వెళ్లి స్టోర్లలోని ఫోన్లను దోచుకున్నారు.  లులులెమన్, యాపిల్ స్టోర్, ఫుట్‌‌‌‌లాకర్ వంటి రిటైల్ స్టోర్‌‌‌‌లను లూఠీ చేశారు. అయితే, ఐఫోన్​లోని యాన్టీ థెఫ్ట్ ఫీచర్​ ద్వారా తాము దొరికిపోయే చాన్స్ ఉందని చాలామంది వాటిని పడేస్తున్నట్లు ఫ్యాక్స్ న్యూస్  వెల్లడించింది. చోరీ విషయం తెలియగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. కొన్ని స్టోర్ల దగ్గరికి వెళ్లి యువతీ యువకులను అరెస్ట్ చేశారు.