డ్యాన్స్ ఈవెంట్పైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు

డ్యాన్స్ ఈవెంట్పైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు
  • బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పరావ్ టోలాలో  ఘటన

పాట్నా: బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పశ్చిమ చంపారణ్ జిల్లా పరావ్ టోలాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసేందుకు వచ్చిన జనంపైకి ఓ బస్సు వేగంగా దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను బహదూర్ మహ్తో, సంజయ్ కుమార్, భోలా దూబే, దేవేందర్ దూబే, ఝంగుర్ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా గుర్తించామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు, ట్రక్కు డ్రైవర్లు పరారయ్యారు.

 నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఓ చిన్నారి పుట్టిన ఆరో రోజు నిర్వహించే వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.