బ్రాటిస్లావా (స్లొవేకియా): ఇండియా యంగ్ రెజ్లర్ మాన్సీ లాథర్.. అండర్–20 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. శనివారం జరిగిన విమెన్స్ 68 కేజీల ఫైనల్లో మాన్సీ 1–2తో చెన్లింగ్ సాంగ్ (చైనా) చేతిలో ఓడి రెండో ప్లేస్‌తో సరిపెట్టుకుంది. బౌట్ ఆరంభంలో మెరుగ్గా ఆడిన ఇండియన్ రెజ్లర్ తర్వాత వెనకబడింది.
చెన్లింగ్ వ్యూహాత్మకంగా పాయింట్లు రాబట్టి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 57 కేజీల విభాగంలో తన్వీ 10–4తో అగ్నియా క్రాకవోస్కా (కెనడా)పై, 59 కేజీల్ల్లో కోమల్ 5–2తో ఎడా బాలాజ్ (హంగేరి)పై గెలిచి కాంస్యాలను సాధించారు. దాంతో ఇండియా ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి.
