జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. 2026 ఆగస్టు 23న తెల్లవారుజామున 5.9 తీవ్రతతో నమోదైన భూకంపంతో జపాన్ ఒక్కసారిగా ఊగిపోయింది. భవనాలు, వాహనాలు ఊగిపోవడంతో జనాలు ఉన్నట్లుండి కింద పడిపోయారు. వాహనాలు పట్టుతప్పి పడిపోయాయి. పెద్ద పెద్ద భవంతులు పెచ్చులు రాలటం, డ్యామేజ్ అవ్వటంతో భయాందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు 23 మంది గాయాలపాలయ్యారు
ఆదివారం తెల్లవారుజామన 2 గంటల ప్రాంతంలో ఇబరాకి పర్ఫెక్చర్ దక్షిణ ప్రాంతంలో 68 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదైనట్లు క్యోడో న్యూస్ రిపోర్ట్ చేసింది. అయితే సునామీ ప్రమాదమేమీ లేదని జపాన్ భూకంప కేంద్రం తెలిపింది.
భారీ కుదుపుల కారణంగా రైళ్లను ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్టేషన్లలో ఉన్న ట్రైన్స్ షెడ్యూల్ డిలే చేశారు. ప్రజలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు పిలుపునిచ్చాయి. దీనికి తోడు విద్యత్ సరఫరా నిలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
సెంట్రల్ టోక్యోలోని ఉయెనోను చిబా ప్రిఫెక్చర్‌లోని నరిటా ఎయిర్ పోర్ట్ ను కలిపే కీసే లైన్, ఉదయం 9:40 గంటల తర్వాత సాధారణ కార్యకలాపాలు మొదలైనట్లు క్యోడో న్యూస్ నివేదించింది. అయితే, టోబు రైల్వే ఎక్స్‌ప్రెస్ మార్గాలు నిలిచిపోయినట్లు వెల్లడించింది.
ఈ భూకంపం కారణంగా 23 మంది గాయపడగా.. ఇద్దరు చనిపోయినట్లు ఫైర్, విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. టోక్యోకు ఉత్తరాన ఉన్న సైతామా ప్రిఫెక్చర్‌లో ఒక యువకుడు, 70 ఏళ్ల ఒక మహిళ చనిపోయినట్లు తెలిపారు. రాజధానికి సరిగ్గా దక్షిణాన ఉన్న కవాసాకిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు.
భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని నిర్ధారించి, ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ప్రధాని సనాయ్ తకైచి .
Magnitude 5.8 earthquake rattles Japan, shaking felt in Tokyo pic.twitter.com/bnRtDgwI7v
— IndoAsia News (@newsbulletin05) August 23, 2026
