స్టార్క్‌ దెబ్బకు బంగ్లా విలవిల.. తొలి బాల్‌కే వికెట్‌తో అరుదైన వరల్డ్‌ రికార్డు

స్టార్క్‌ దెబ్బకు బంగ్లా విలవిల.. తొలి బాల్‌కే వికెట్‌తో అరుదైన వరల్డ్‌ రికార్డు

మెక్‌‌‌‌‌‌‌‌కే: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో బౌలర్లు విజృంభించారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌ స్టార్క్‌‌‌‌‌‌‌‌ (6/12) బంగ్లాను దెబ్బకొడితే.. షోరిఫుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (6/35) అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. దాంతో టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 34 ఓవర్లలో 64 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. షోరిఫుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (14) టాప్‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే షాద్మాన్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన స్టార్క్‌‌‌‌‌‌‌‌ వరుస విరామాల్లో వికెట్లు తీశాడు. దాంతో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌కే పరిమితమయ్యారు. 

ఇందులో నలుగురు డకౌట్లయ్యారు. మెహిదీ హసన్‌‌‌‌‌‌‌‌ (11), తైజుల్‌‌‌‌‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌‌‌‌‌ (11), హసన్‌‌‌‌‌‌‌‌ మహమూద్‌‌‌‌‌‌‌‌ (10) నిరాశపర్చారు. కమిన్స్‌‌‌‌‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు 40 ఓవర్లలో 165/8 స్కోరు చేసింది. కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ (51 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), నాథన్‌‌‌‌‌‌‌‌ లైయన్‌‌‌‌‌‌‌‌ (10 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (22), స్టీవ్‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌ (42) ఫర్వాలేదనిపించారు.  ప్రస్తుతం ఆసీస్‌‌‌‌‌‌‌‌ 101 రన్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌‌లో స్టార్‌‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌‌ల్లో మొదటి బాల్‌‌కు నాలుగుసార్లు వికెట్లు తీసిన తొలి బౌలర్‌‌గా వరల్డ్‌‌ రికార్డు సృష్టించాడు.