తెలంగాణ షూటర్ ధునుష్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌కు సన్మానం

తెలంగాణ షూటర్ ధునుష్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌కు సన్మానం

హైదరాబాద్​ వెలుగు : తెలంగాణ షూటర్, అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌‌‌‌ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవి ఘనంగా సన్మానించారు. శనివారం ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో ఈ సందర్భంగా ఆమె శ్రీకాంత్‌‌‌‌ను అభినందించారు. షూటింగ్ క్రీడలో సాధించిన అద్భుత విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. 

భవిష్యత్‌‌‌‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అనిత  డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, రవితేజ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.