ముంబై: ఎంఐ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌గా జుబిన్‌‌‌‌‌‌‌‌ భరూచా

ముంబై: ఎంఐ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌గా జుబిన్‌‌‌‌‌‌‌‌ భరూచా

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో అత్యంత విజయవంతమైన ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీ.. జుబిన్‌‌‌‌‌‌‌‌ భరూచాను టీమ్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా నియమించింది. ఈ ఫ్రాంచైజీకి చెందిన వివిధ విభాగాల లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లతో కలిసి జుబిన్‌‌‌‌‌‌‌‌ పనిచేయనున్నాడు. ముంబై, సర్రే జట్ల తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన జుబిన్.. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సుదీర్ఘకాలం పాటు సేవలందించాడు. 

అక్కడ టీమ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ క్రికెట్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ వంటి పలు కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వంటి యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎకోసిస్టమ్‌‌‌‌‌‌‌‌లో చేరిన జుబిన్.. ఆటగాళ్ల అభివృద్ధిలో ముంబై ఇండియన్స్ అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సపోర్ట్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేస్తారని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో వెల్లడించింది.