Ind vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. కుల్దీప్ ఔట్.. సరాన్ష్ ఆరంగేట్రం

Ind vs Sri Lanka: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. కుల్దీప్ ఔట్.. సరాన్ష్ ఆరంగేట్రం

సిరీస్ పై కన్నేసిన టీమిండియా రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 2026 ఆగస్టు 23న కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంకపై భారీ స్కోర్ టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగా బ్యాటింగ్ ఎంచుకుంది.

గల్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఫస్ట్ టెస్టులో గెలుపుతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో ఇండియా తన సత్తా ఏంటో చాటింది. ఇక రెండో టెస్టులోని గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగుతోంది. 

స్క్వాడ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ లో కుల్దీప్ ఆడటం లేదు. స్వల్ప అస్వస్థతతో ఈ మ్యాచ్ కు కుల్దీప్ దూరమయ్యాడు. కుల్దీప్ స్థానంలో స్పిన్నర్ సరాన్ష్ జైన్ ఆరంగేట్రం చేస్తున్నాడు. 

టీమ్స్:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(సి), రిషబ్ పంత్(w), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శరన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

శ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(సి), సోనాల్ దినుషా, నిరోషా

 గాలేతో పోలిస్తే  ఇక్కడ సింహలే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ ఇది చాలా గట్టిగా, మెరుగైన ఉపరితలంలా కనిపిస్తోందని కెప్టెన్ శుభ్ మన్ గిల్ అన్నారు.. గాలే పిచ్ కూడా చాలా బాగుండేది, కానీ ఆట సాగుతున్న కొద్దీ అది కాస్త నెమ్మదించి, బంతి తిరగడం (స్పిన్ అవ్వడం) మొదలైంది. ఇక్కడ కూడా అదే జరుగుతుందని ఆశిస్తున్నాం, కానీ మొదటి రెండు మూడు రోజులు మాత్రం బ్యాటింగ్‌కు ఇది చాలా అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం.. అని చెప్పాడు.  దురదృష్టవశాత్తు కుల్దీప్‌కు ఇన్ఫెక్షన్ సోకడంతో అతను జట్టుకు దూరమయ్యాడని.. దాంతో సారాన్ష్ భారత్ తరపున అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. 

పిచ్ రిపోర్ట్:  

ఇక పిచ్ గురించి ఇక్కడ భారీగా పరుగులు నమోదవుతాయని ఆశిస్తున్నట్లు సంజయ్ మంజ్రేకర్. ఈ పిచ్ స్వభావమే అటువంటిది.. ఇది మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు, అలాగే రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు కూడా మంచి స్కోర్లు సాధించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ఉదయం టెస్ట్ మ్యాచ్ కోసం పిచ్‌ను పరిశీలిస్తే, గాలే (Galle) టెస్టులో వ్యవహరించిన క్యూరేటరే ఇక్కడా అదే విధానాన్ని అనుసరించినట్లు స్పష్టమవుతోంది.