హౌస్ఫుల్ కలెక్షన్స్తో హుషార్ పిట్టలు

హౌస్ఫుల్ కలెక్షన్స్తో హుషార్ పిట్టలు

కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ‘హుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిట్టలు’ మరోసారి నిరూపించిందని చిత్ర యూనిట్ చెప్పింది.  అన్షు, వాసవి గణేశన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంటగా భిక్షు దర్శకత్వంలో వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించిన  ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలై  తొలివారంలో రూ.5 కోట్ల 27 లక్షల గ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించింది. 

ఈ సందర్భంగా టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. దర్శకుడు భిక్షు మాట్లాడుతూ ‘చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాల మధ్యలో హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతోంది. రెండవ వారంలోకి  కూడా అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఫిల్మ్స్ తీస్తా’ అని అన్నాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హీరో హీరోయిన్ థ్యాంక్స్ చెప్పారు. 

ఈ  కథకు అందరూ కనెక్ట్ అవుతున్నారని నిర్మాత కె.వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.  కొత్తవారితో తెరకెక్కించిన  ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రారంభమై నేటికీ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వసూళ్లతో కొనసాగడం గొప్ప విషయం అని  బెక్కెం వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.