హనుమకొండ, వెలుగు: ప్రైవేటు పాఠశాలలను కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంతో పాటు టీచర్ రూపారెడ్డి ఫ్యామిలీకి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాస్టర్ జీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. నల్గొండ నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ శనివారం హనుమకొండలోని అదాలత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రైవేట్ స్కూల్ టీచర్లు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ గురువులకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వడుప్సా నాయకులు ఎన్.రమేశ్, ఎన్.నారాయణరెడ్డి, నాగార్జున రెడ్డి, సతీశ్ కుమార్, జ్ఞానేశ్వర్, ముక్తేశ్వర్, శ్రీధర్, జి.రమేశ్, రాంబాబు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.
