న్యూఢిల్లీ: ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల పేర్లతో చలామణి అవుతున్న నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను తక్షణమే తొలగించాలని గూగుల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సైబర్ కేటుగాళ్లు గూగుల్‌కు చెందిన ‘ఫైర్‌బేస్’ ప్లాట్‌ఫామ్‌ను అడ్డాగా చేసుకొని అమాయక ఖాతాదారులను నిలువునా దోచుకుంటున్నట్టు గుర్తించిన కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ).. ఈమేరకు గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంపై గూగుల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఫిషింగ్, మాల్వేర్ వ్యాప్తి, ఆర్థిక మోసాలకు పాల్పడే ఖాతాలపై సంస్థ నిబంధనలు ఎంతో కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.
