టూర్ క్యాన్సిల్ చేసుకున్న వైఫ్..మరి భర్త ఏం చేశాడంటే..

టూర్ క్యాన్సిల్ చేసుకున్న వైఫ్..మరి భర్త ఏం చేశాడంటే..

ఇష్టమైన వారితో ప్రయాణం..ఎంత కష్టమైనా ప్రేమగానే ఉంటుంది. నచ్చినవారితో షికారుకు వెళ్లాలని ప్రతీ  ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. ఇక లైఫ్ పాట్నర్తో టూర్కు వెళ్లాలనేది ప్రతీ వ్యక్తి కోరిక. అయితే కొందరు అన్ని ముందే ప్లాన్ చేసుకుని తమ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తుంటారు. మరికొందరు భార్యకో..లేక..భర్తకో లీవ్ దొరక్క..లేదా ఇతర ముఖ్యమైన పని వల్ల టూర్ను క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ ఫిలిప్పైన్స్కు చెందిన ఓ వ్యక్తి మాత్రం..తన లైఫ్ పాట్నర్ రాకున్నా..ఆమె తనతో గడిపేందుకు వినూత్నంగా ఆలోచించాడు. 

ఫిలిప్పైన్స్‌కు చెందిన రేమండ్ ఫార్చునాడో తన వైఫ్తో కలిసి కరోన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే లాస్ట్ మినట్లో అతని వైఫ్  జోవాన్ ఫార్చునాడో  వర్క్ ఉందని రాలేనని చెప్పింది. దీంతో రేమండ్ తీవ్రంగా బాధపడ్డాడు. టూర్ క్యాన్సిల్ చేయవద్దని నిర్ణయించుకున్నాడు. తన భార్య రాకున్న ఆమె తనతో ఉన్నట్లే ఉండాలి..అది ఎలా సాధ్యం అని ఆలోచించాడు. ఇంతలో అతనికి అద్బుతమైన ఐడియా వచ్చింది. జోవాన్  ఫేస్ ప్రింట్ చేసిన ఉన్న దిండుని వెంట తీసుకెళ్లాడు.  రేమండ్ ఎక్కడికెళ్తే అక్కడికి ఆ దిండును పట్టుకెళ్లాడు.  పక్కనే పెట్టుకుని ప్రకృతి అందాలను తిలకించాడు.  నచ్చిన ప్లేస్‌లో  భార్య ఫేస్ తో కూడిన పిల్లోతో ఫోటోలు దిగాడు.  ఈ ఫోటోలను, వీడియోలను   సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..ఈ ఐడియా ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. 

రేమండ్ ఐడియాను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఐడియా అందిరింది అంటూ ప్రశంసిస్తున్నారు.  కొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. హౌ క్యూట్ అంటూ..లక్కీ గర్ల్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.