స్పెషల్ స్టోరీ : ఫోన్కు అతుక్కుపోయే పిల్లల కంటికి పెద్ద గండం !!

స్పెషల్ స్టోరీ : ఫోన్కు అతుక్కుపోయే పిల్లల కంటికి పెద్ద గండం !!

మీ ఇంట్లో పిల్లలు సెల్ ఫోన్లు, ట్యాబ్ లు అదే పనిగా చూస్తున్నారా ?  గంటల తరబడి టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా ? ఐతే ఇబ్బందులు తప్పవంటున్నారు కంటి డాక్టర్లు. రోజు రోజుకు కంటి సమస్యలతో బాధపడే చిన్నారులు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ లో మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో పాటే సమస్యలు అంతే స్థాయిలో రెట్టింపవుతున్నాయి. చిన్న వయస్సులోనే పిల్లలు మొబైల్స్, ట్యాబులు, కంప్యూటర్లకు ఎడిక్ట్ అవుతుండడంతో కంటి సమస్యలు వస్తున్నాయి. ఒకటి, రెండు తరగతుల్లోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తున్నారు చిన్నారులు. కరోనాకు ముందు ప్రతీ వంద మందిలో ఐదుగురికి చూపు సమస్య వచ్చేది. కానీ కరోనా దెబ్బకు ఆన్  లైన్  తరగతులతో పిల్లలు గంటలకొద్దీ కంప్యూటర్లు, స్మార్ట్  ఫోన్ లను యూజ్ చేయడం కామన్ అయ్యింది. దీంతో లాంగ్ సైట్ తో ఇబ్బంది పడుతున్నారు. ప్రతీ వందమందిలో 20 మందికి పైగా చిన్నారులు మయోపియా సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు ఐ స్పెషలిస్టులు.

మయోపియా సమస్య ఎక్కువగా ..

మయోపియా సమస్య ఎక్కువగా 3 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల్లో కనిపిస్తుందని.. కొందరిలో పదేళ్ల వయసులో బయటపడుతుందని అంటున్నారు డాక్టర్లు. పిల్లలను మొబైల్స్, టీవీల నుంచి దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. బయట ఎక్కువగా ఆడుకునేలా చేయడం, పౌష్టికాహారంతో ఈ సమస్యను 50 పర్సంట్ వరకు కంట్రోల్ చేయొచ్చని సూచిస్తున్నారు. మయోపియా నియంత్రణ, నివారణ కోసం ఎలాంటి చర్యలూ తీసుకోకపోతే 2050 నాటికి ఇది ప్రపంచ జనాభాలో సగం మందిపై ప్రభావం పడుతుందని ఓ సర్వేలో తేలిందని కంటి వైద్యులు  శ్రీలక్ష్మీ చెప్పారు. 

కంటి సమస్య ఉన్నా పేరంట్స్ కు చెప్పరు

చాలామంది పిల్లలు తమకు కంటి సమస్య ఉన్నా పేరంట్స్ కు చెప్పరని అంటున్నారు డాక్టర్లు. దీంతో పిల్లలకు కనీసం ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు. వారిలో ఏవైనా లోపాలుంటే ముందే తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.  పిల్లల స్ర్కీన్  టైంను తక్కువ చేయాలంటున్నారు. ప్రతీ గంటకు లాంగ్ విజన్ ను చూడాలని కంటి వైద్యులు  శ్రీలక్ష్మీ సూచిస్తున్నారు.  కొంతమందిలో జెనెటిక్ గా కూడా చిన్నతనంలోనే కంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఐ డాక్టర్స్. దీనిని మొదట్లోనే గుర్తించి నిపుణులను సంప్రదించాలని చెప్తున్నారు.