
- ఎమ్మెల్యే యెన్నం
పాలమూరు, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు నోటీసులు పంపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ట్యాపింగ్‌కు గురైందని, సీడీఆర్ జాబితాలో ఎమ్మెల్యే ఫోన్ నంబర్ఉన్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల10న ఉదయం11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరై స్టేట్ మెంట్ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు.