గెస్ట్ లెక్చరర్ల సమస్యలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా

గెస్ట్ లెక్చరర్ల సమస్యలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా

మీ సమస్యలేంది!

వారి పోస్టులను రెన్యువల్​ చేయని సర్కారు

ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే  బుజ్జగింపులని అనుమానం

జిల్లాల్లో గెస్ట్ లెక్చరర్లకు ఇంటెలిజెన్స్ వర్గాల ఫోన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ గ్రాడ్యుయేట్ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సర్కారు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 9 నెలలుగా జాబ్ లేక  అవస్థలు పడుతున్న సర్కారు జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని గెస్ట్ లెక్చరర్లను ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటోంది. వారి సమస్యలను, అందుకు పరిష్కారాలను వారి నుంచే తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపింది. రాష్ట్రంలోని 404 సర్కారు జూనియర్ కాలేజీల్లో 1,500 మంది, 132 డిగ్రీ కాలేజీల్లో 1,940 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికీ నెలలో 72 క్లాసులు కేటాయించి, రూ. 21,600 గౌరవ వేతనం అందించాల్సి ఉంటుంది. అయితే 2019–20 అకడమిక్​ ఇయర్​లో విధుల్లో కొనసాగిన వీళ్లందరినీ..  మార్చి నుంచి ప్రభుత్వం విధుల్లోకి తీసుకోలేదు. వారి పోస్టును రెన్యువల్ చేయలేదు. దీంతో 9 నెలలుగా జాబ్​ లేక, చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల మాదిరిగా తమనూ రెన్యువల్ చేయాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ వారు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఉన్నట్టుండి వారం, పదిరోజుల నుంచి జిల్లాల్లోని గెస్ట్ లెక్చరర్లకు ఇంటెలిజెన్స్ వర్గాలు ఫోన్లు చేస్తున్నాయి. ‘‘మీరు ఎట్ల రిక్రూట్య్యా అయ్యారు? ఎన్నేండ్ల నుంచి పనిచేస్తున్నరు? ఎన్ని గంటలు పనిచేస్తుంటరు? మీ గౌరవ వేతనం ఎంత? మీ సమస్యలు ఏమిటి? వాటికి పరిష్కారాలు ఏం చెప్తారు? ఏమైనా ఆందోళనలు చేశారా?..” వంటి అనేక ప్రశ్నలు వేసి, వివరాలు సేకరిస్తున్నాయి. ఎందుకు ఈ సమాచారం సేకరిస్తున్నారని ఇంటెలిజెన్స్​ వర్గాలను కొందరు గెస్ట్​ లెక్చరర్లు అడిగితే, ‘‘మీ సమస్యలను ప్రభుత్వానికి చెప్పేందుకే’’నని బదులిస్తున్నాయి. ‘‘ఇంటెలిజెన్స్ అంతా డైరెక్ట్ సీఎం, సీఎంవోతోనే టచ్ లో ఉంటుందని, వారి ఆదేశాల మేరకే ఈ వివరాలు సేకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్​ వర్గాలు చెప్తున్నాయి” అని కొందరు గెస్టు లెక్చరర్లు పేర్కొన్నారు. ఒకపక్క సీఎం దృష్టికి తమ సమస్య పోతున్నందుకు సంతోషంగా ఉన్నా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అనుమానం గెస్ట్​ లెక్చరర్లలో ఉంది. ఏదిఏమైనా వెంటనే తమను రెన్యువల్ చేయాలని వారు
కోరుతున్నారు.

17న టీచర్ల నిరాహార దీక్షలు

పోస్టర్లు రిలీజ్ చేసిన జాక్టో, యూఎస్పీసీ నేతలు

స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచర్లకు ప్రమోషన్లు కల్పించి, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్లు చేయాలని  జాక్టో, యూఎస్పీసీ నేతలు కోరారు. ఆయా డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల17న అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. అప్పటికీ రాష్ట్ర సర్కారు స్పందించకపోతే, ఈనెల 29న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎస్టీయూ స్టేట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో జాక్టో, యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఆందోళనలకు సంబంధించిన వాల్‌‌‌‌‌‌‌‌ పోస్టర్లను రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆరేండ్లుగా ప్రమోషన్లు లేక టీచర్లు నష్టపోతున్నారని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్లు, టీచర్ల కొరతతో స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ స్టడీపై ప్రభావం పడుతోందని చెప్పారు.

For More News..

టీఎస్‌‌‌‌పీఎస్సీ చైర్మన్ రేసులో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లు

నయీం ఇంట్లో 24 గన్స్ ఎక్కడివి? 602 సిమ్ కార్డుల కాల్ డేటా సంగతేంది?

రైతులకు వడ్ల పైసలు అందలె.. బ్యాంకులు లోన్లు ఇస్తలె..