పుష్ప2 షూటింగ్లో అల్లు అర్జున్ చేతికి గాయం.. లీకుడ్ పిక్ వైరల్

పుష్ప2 షూటింగ్లో అల్లు అర్జున్ చేతికి గాయం.. లీకుడ్ పిక్ వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు ఏమైంది? ఆయన చేతికి ఆ కట్టు ఏంటి? ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మససుల్లో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుష్ప2 పిక్ చూసి బన్నీ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. తమ అభిమాన హీరోకి ఎం జరిగిందో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2(Pushpa2) షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం షూటింగ్ ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. జాతర బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ యాక్షేన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలువనుందని టాక్. ఇక ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో కనిపించనున్నాడట. ఆ అవతారంలో బన్నీ పర్ఫార్మెన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. 

అయితే ఈ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఎడమ చేతికి చిన్నపాటి గాయం అయిందట. అయితే.. అది పెద్ద దెబ్బ కాదని, జస్ట్ 2 డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతునని డాక్టర్స్ తెలిపారట. ఇటీవల విడుదలైన పుష్ప 2 లీకుడ్ పిక్ అది క్లియర్ గా కనిపించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త కంగారుపాడారు కానీ, అంత పెద్ద గాయమేమీ కాదని తెలుస్తోంది. ఇక ఆ గాయం నుండి కోలుకున్న అల్లు అర్జున్ [తిరిగి షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారట. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. ఇక పుష్ప2 విషయానికి వస్తే.. రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.