చిత్రాలు చూడగా!

చిత్రాలు చూడగా!
  • పెటోగ్రఫీ

కెమెరా చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ అందమైన ఫొటోలు తీయాలని, రకరకాల ప్రదేశాలకు వెళ్తారు. ప్రకృతిని, మనుషుల్ని వేర్వేరు స్టైల్స్‌‌లో ఫొటోలు తీస్తుంటారు. అయితే, ఈ ఫొటోగ్రాఫర్​ ఉల్దిస్ క్రీవ్స్​కి కుక్కలంటే మహా ఇష్టం. అందుకని ఆయన ఎక్కువగా కుక్కలనే ఫొటోలు తీస్తుంటాడు. అది కూడా సాదాసీదాగా కాదు. ఇవిగో చూడండి.. ఇలా వెరైటీ వెరైటీ యాంగిల్స్, థీమ్స్​తో క్యూట్​గా ఫొటోలు తీస్తాడు. ఈయన పెట్స్​ని ఫొటో తీస్తున్నాడు కాబట్టి పెటోగ్రాఫర్​ అంటున్నారు. పోయిన నెలలో ఉల్డిస్ వాళ్లింటికి దగ్గరలో ఉన్న అడవిలోకి భార్యతో కలిసి వెళ్లాడు. వాళ్ల వెంట కుక్కల్ని కూడా పట్టుకెళ్లాడు. అక్కడ తీసినవే హోలీ పెయింట్ థీమ్​ ఫొటోలు. ఇందుకు సహజంగా తయారైన మల్టీ కలర్​ పౌడర్​ వాడాడు. కుక్కలు ఫొటోకి పోజ్​ ఇవ్వడానికి కాస్త ఇబ్బంది. అందుకని ఫొటోలు తీసేటప్పుడు అతని భార్య పైగే సాయం చేస్తుంది. 

‘‘నేను అందరిలా కుక్కల్ని ఫొటో తీయను. నేను తీసే ఫొటో కాస్త డిఫరెంట్​గా ఉండాలనుకుంటాను. నాకోసం నా భార్య డాగ్​ ట్రైనర్​గా మారింది. నేను ఫొటోగ్రఫీ బిజినెస్​ చేయడానికి కొంత డబ్బు కావాలి. దానికోసమే ప్రస్తుతం ఐటీలో పనిచేస్తున్నా’’ అన్నాడు ఉల్దిస్.