ఆలింగనాలకు దూరంగా ఈద్ ముబారక్

ఆలింగనాలకు దూరంగా ఈద్ ముబారక్

దేశమంతటా రంజాన్ పర్వదినాన్ని సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నారు ముస్లింలు. ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ.. ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు. రంజాన్ అనగానే కనిపించే ఆలింగనాలకు ఈసారి పలుచోట్ల దూరంగా ఉన్నారు ముస్లింలు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. నగరాల్లోని ప్రధాన మసీదుల దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. మసీదులు తెరవొద్దని….. సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని..ఇప్పటికే రాష్ట్రాల ప్రభుత్వాలు సూచించాయి. దీంతో… ఇండ్లు… ఇంటి ఆవరణలు.. పైకప్పులపై… ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ… ప్రార్థనలు చేశారు ముస్లింలు.

ముస్లిం సోదరులు లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ.. రంజాన్ పండుగ చేసుకోవాలని సూచించారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఇంటిలోనే ప్రార్థన చేసిన నఖ్వీ.. కరోనాపై పోరాటాన్ని ఆపొద్దని సూచించారు. ఇప్పటికే కరోనా నియంత్రణకు దేశ ప్రజలు తమవంతుగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు