అరేయ్ ఏంట్రా ఇది...పైనాపిల్తో మోమోస్..హే భగవాన్..

అరేయ్ ఏంట్రా ఇది...పైనాపిల్తో  మోమోస్..హే భగవాన్..

దేశంలో చిత్రమైన వంటకాలు...విచిత్రమైన స్ట్రీట్ ఫుడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొత్తగా వంటలు చేసి..జనానికి పరిచయం చేద్దామని ఎంతో మంది అనుకుంటారు. అలాగే వెరైటీ వంటలు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ విచిత్రమైన వంటకం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఓ వ్యక్తి  పైనాపిల్ తో మోమోలను తయారు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ పైనాపిల్ మోమోస్ నెట్టింట్ల తెగ వైరల్ అయ్యాయి. 

వీడియోలో ఓ చెఫ్ పైనాపిల్ తో  మోమోస్ ఎలా తయారు చేశాడో చూపించాడు. ముందుగా పైనాపిల్ పండ్లను కట్ చేశాడు. ఆ తర్వాత మోమో కవరింగ్ లోపల పైనాపిల్ ముక్కలను వేశాడు. అనంతరం నూనెలో వాటిని డీప్ ఫ్రై చేశాడు. 

Also Read :- ఇండియాలోనే అతి పెద్ద సైబర్ క్రైం

పైనాపిల్ తో మోమోస్ ను తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 5 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. వేల సంఖ్యలో లైక్ చేశారు. అయితే పైనాపిల్ మోమోస్ పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరైతే హే భగవాన్ ఇదేమి వంటకం అని కామెంట్ చేశారు.