హైదరాబాద్, వెలుగు : కెప్టెన్అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో విజృంభించడంతో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఉత్కంఠ విజయంతో ఆరంభించింది. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 39–34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. అర్జున్‌తో పాటు రైడర్ అభిజీత్ మాలిక్ (7 పాయింట్లు) జైపూర్ విజయంలో కీలకంగా నిలిచాడు. బెంగాల్ జట్టులో నితిన్ ధాంకర్ (13) సూపర్ టెన్ సాధించగా, మణిందర్ సింగ్ (8), కెప్టెన్ ఫజెల్ అత్రాచలి (6) పోరాడినా ఫలితం లేకపోయింది.
మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36–32తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. బుల్స్ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. గుజరాత్ రైడర్ పర్తీక్ దహియా 8 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు కెప్టెన్ పర్దీప్ నర్వాల్ 9 రైడ్ పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను 1700 రైడ్ పాయింట్ల క్లబ్‌లో చేరాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.