
హైదరాబాద్, వెలుగు: పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్ (పీఎల్ అసెట్ మేనేజ్‌మెంట్) తన మొట్టమొదటి పెర్ఫార్మింగ్ క్రెడిట్ ఫండ్‌ను ప్రారంభించింది. దీనిసైజు రూ.500 కోట్లు కాగా, ఈ మొత్తంతో కంపెనీలకు ఆర్థికపరమైన తోడ్పాటును అందిస్తామని తెలిపింది. స్థిరమైన రాబడిని అందించడం, నష్టాన్ని తగ్గించడం ఫండ్ లక్ష్యమని పీఎల్అసెట్ మేనేజ్మెంట్ తెలిపింది.
వివిధ రంగాల్లోని లిస్టెడ్ అన్-లిస్టెడ్ కంపెనీలలో (రియల్ ఎస్టేట్ మినహా) ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడిదారులకు క్రెడిట్ మార్కెట్‌లోని అవకాశాలను అందిస్తూ, వారి పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండి అప్పులను సకాలంలో తిరిగి చెల్లించగల సామర్థ్యం ఉన్న కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు క్రెడిట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తారు.