
బెంగళూరు: కేంద్ర మంత్రి శోభా కరండ్లజే భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరండ్లజే ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో ముప్పు తప్పింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు శోభా కరండ్లజే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో టేకాఫ్‌కు ముందే విమానాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో నిలిపివేశారు. రన్‌వే మీదకు వెళ్లిన ఫ్లయిట్‌ను తిరిగి పార్కింగ్ బేకు తీసుకొచ్చారు. ముందే సమస్యను గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే హైదరాబాద్ వెళ్లేందుకు మరో ఫ్లయిట్ ఏర్పాటు చేస్తామని మంత్రికి విమానాశ్రయ అధికారులు చెప్పారు. కానీ అందుకు కరండ్లజే తిరస్కరించారు. తనను కూడా సామాన్య ప్రయాణికుల్లో ఒకరిలా చూడాలని పేర్కొన్నారు.