మెదక్‌‌‌‌ జిల్లాలో ఉపాధి కూలీల ఉత్తుత్తి పెండ్లి

మెదక్‌‌‌‌ జిల్లాలో ఉపాధి కూలీల ఉత్తుత్తి పెండ్లి

ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీలంతా కలిసి... దంపతులకు సరదాగా మరోసారి పెండ్లి చేశారు. మెదక్‌‌‌‌ జిల్లా నర్సాపూర్‌‌‌‌ మండలం నత్నాయిపల్లి గ్రామానికి చెందిన కొందరు గురువారం ఉపాధి పనికి వెళ్లారు. 

పని మధ్యలో ఆటవిడుపులో భాగంగా... కూలీలైన భిక్షపతి, పుణ్యమ్మ దంపతులకు తోటి కూలీలు ఉత్తుత్తి పెండ్లి తంతు నిర్వహించారు. అడవిలో దొరికే పువ్వులతోనే దండలు తయారు చేసి, ఆకులనే అక్షింతలు, తలంబ్రాలుగా భావించి పెండ్లి జరిపించారు.  

- నర్సాపూర్, వెలుగు