వీడియో వైరల్: మా నాన్నను కొట్టొద్దు.. పోలీసులను వేడుకున్న బాలుడు

వీడియో వైరల్: మా నాన్నను కొట్టొద్దు.. పోలీసులను వేడుకున్న బాలుడు

వనపర్తిలో దారుణం జరిగింది. కొడుకు కళ్ల ముందే తండ్రిని చితక్కొట్టిన ఘటన అందరినీ అయ్యో అనిపించేలా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న కారణంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. ఏప్రిల్ 14 వరకు ఈ లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల ప్రజలెవరూ రోడ్ల మీదికి రాకూడదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. దాంతో జిల్లాల్లోని రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ఎవరూ రోడ్డు మీదకు రావొద్దని పోలీసులకు ఆదేశాలు అందాయి. దాంతో ప్రజలెవరిని రోడ్ల మీద తిరగనివ్వడం లేదు.

ఈ లాక్ డౌన్ కు సంబంధించి వనపర్తి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన పదేళ్ల కొడుకుతో ఏదో పని మీద బయటకొచ్చాడు. అలా వచ్చిన వాడు పోలీసుల కంట పడ్డాడు. దాంతో రెచ్చిపోయిన పోలీసులు కొడుకు ముందే ఆ తండ్రిని చితకబాదారు. అంతేకాకుండా పోలీసులు
అసభ్యపదజాలంతో ఆ వ్యక్తిని దుర్భాషలాడారు. చిన్నపిల్లవాడి ముందు పోలీసుల ప్రవర్తించిన తీరు చూసి స్థానికులు మండిపడుతున్నారు. మా నాన్నను కొట్టొద్దంటూ ఆ పదేళ్ల కొడుకు పోలీసులను వేడుకున్నాడు. అయినా కనికరించని పోలీసులు ఆ వ్యక్తిని కొడుకు కళ్ల ముందే కింద పడేసి మరీ కొట్టారు. ఈ ఘటన ఆ పిల్లవాడి మనసులో ఓ ముద్ర వేస్తుందని అది చూసిన వారంటున్నారు. కొట్టడమే కాకుండా.. ఆ తండ్రికొడుకులిద్దరినీ పెట్రోలింగ్ వ్యానులో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొడుకు ముందే తండ్రిని కొట్టి దూషించిన ఘటనపై విచారణ జరపాలంటూ డీజీపీ వనపర్తి ఎస్పీని ఆదేశించారు. దాంతో కానిస్టేబుల్ అశోక్ ను సస్పెండ్ చేస్తూ సీపీ అపూర్వ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయంపై పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయడంతో విషయం ఆయన దాకా వెళ్లింది. వెంటనే స్పందించిన కేటీఆర్.. డీజీపీకి, హోంమంత్రికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

For More News..

కరోనా సోకని దేశాలేవో తెలుసా?

కరోనాతో ఆరు వారాల శిశువు మృతి

ఏప్రిల్ 14 వరకు ఫ్రీగా పాలు, కూరగాయలు

3 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు.. మీ బండి ఉందేమో చెక్ చేసుకోండి..

కరోనా చావులతో రికార్డుకెక్కిన అమెరికా.. ఒక్కరోజులోనే..