హైదరాబాద్​లో ప్లగ్​ అండ్​ ప్లే సెంటర్

హైదరాబాద్​లో ప్లగ్​ అండ్​ ప్లే సెంటర్
  • హెల్త్​ కేర్, ఎనర్జీ సహా పలు రంగాల స్టార్టప్​లలో పెట్టుబడులు
  • కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్​ టీం ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: గూగుల్, డ్రాప్​బాక్స్, లెండింగ్​ క్లబ్​లాంటి స్టార్టప్‌‌‌‌ల్లో పెట్టుబడులు పెట్టిన వరల్డ్​లీడింగ్​ఓపెన్​ఇన్నోవేషన్​ప్లాట్​ఫామ్​‘ప్లగ్​అండ్​ప్లే’ హైదరాబాద్​లో సెంటర్​ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్యారిస్‌‌‌‌లో మంత్రి కేటీఆర్‌‌‌‌తో జరిగిన మీటింగ్​తర్వాత ప్లగ్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్లే ప్రతినిధులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో హెల్త్​కేర్, ఎనర్జీ, ఇంటర్నెట్ ఆఫ్​థింగ్స్, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్​వంటి రంగాల్లోని స్టార్టప్​లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చినట్లు మంత్రి కేటీఆర్​ప్రతినిధుల బృందం శనివారం రిలీజ్​చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ప్లగ్ అండ్​ప్లే సేవలు ఈ ఏడాది డిసెంబర్​లో ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈవో సైదీ అమిదీ చెప్పారు. ‘అంతర్జాతీయ పెట్టుబడులను రాబట్టడంలో తెలంగాణ ముందుందని, ప్లగ్ అండ్ ప్లే వంటి సంస్థలు పెట్టుబడులకు హైదరాబాద్​ను ఎంచుకోవడం హర్షించదగ్గ విషయం’ అని మంత్రి కేటీఆర్​అన్నారు. ఈ మేరకు కేటీఆర్​సహా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, చీఫ్​ రిలేషన్స్ ఆఫీసర్ ​అమర్​నాథ్​రెడ్డిల టీం ప్యారీస్​లో  ఫ్రెంచ్​గవర్నమెంట్ ప్రతినిధులతో సమావేశమై వివిధ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు. 

30 వేల స్టార్టప్​లకు పైగా..
ప్లగ్‌‌‌‌ అండ్‌‌‌‌ ప్లే సంస్థ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 33 వేలకు పైగా స్టార్టప్‌‌‌‌లకు ఇన్వెస్ట్​చేసింది. ఇందులో గూగుల్​సహా 500కు పైగా సంస్థలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లీడింగ్‌‌‌‌ కార్పొరేట్‌‌‌‌ కంపెనీలుగా ఉన్నాయి. వెంచర్‌‌‌‌ ఫండింగ్‌‌‌‌ ద్వారా ఇప్పటి వరకు 9 బిలియన్‌‌‌‌ డాలర్ల పెట్టుబడిని స్టార్టప్‌‌‌‌ కంపెనీల్లో ఇన్వెస్ట్​చేసింది. అమెరికా, జర్మనీ, జపాన్‌‌‌‌, చైనా, స్పెయిన్‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌ ఇలా 37 చోట్ల కంపెనీ ఆఫీసులు ఉన్నాయి. కాగా, డిసెంబర్ ​మొదటి వారంలో హైదరాబాద్​లోనూ ప్లగ్​ అండ్ ​ప్లే తన సెంటర్​ను ప్రారంభించబోతుంది. ఏషియాలో జపాన్‌‌‌‌, చైనా తర్వాత ఇండియాలో మూడో ఆఫీస్ హైదరాబాద్​లోనే నెలకొల్పనుంది.