
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2023 నిధులను ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని సీకర్ లో విడుదల చేశారు. 14వ విడత కింద దేశంలోని 8.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.17వేల00 కోట్లకు పైగా మొత్తాన్ని బదిలీ చేశారు. ఒక్కో రైతు ఖాతాలోకి రూ.2 వేలు జమ కానున్నాయి. పీఎం కిసాన్ కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రాజస్థాన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా 1.25 లక్షల పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి అండగా నిలుస్తోందన్నారు. 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.