‘పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన’ ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ. 2.30 లక్షలు మోసం

‘పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన’ ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూ. 2.30 లక్షలు మోసం

మిడ్జిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ‘పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రూ. 2.30 లక్షలు కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా మిడ్జిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కాటోనిగడ్డ తండాకు చెందిన నానునాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బుధవారం వాట్సప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీఎం కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో ఓ ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో దానిని క్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి వదిలేశాడు. 

కొద్దిసేపటి తర్వాత తన బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోగా.. అందులో ఉండాల్సిన రూ. 2.30 లక్షలు కనిపించలేదు. వెంటనే బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఫ్రీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. తర్వాత మిడ్జిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.